: బీజేపీ నిన్ను యూపీలోకి రానివ్వలేదు.. అందుకే ఆ పార్టీ అక్కడ గెలిచింది: బీహార్ బీజేపీ నేతకు లాలూ చురకలు


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గా దూసుకుపోతోన్న నేప‌థ్యంలో బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కి చుర‌క‌లు అంటించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా లాలూ బీజేపీపై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. సుశీల్ కుమార్ మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ రోజు ‘ఎలా ఉన్నారు లాలూ?’ అని పేర్కొన్నారు. దానికి లాలూ అదే ట్విట్ట‌ర్‌లో దీటుగా స‌మాధానం ఇచ్చారు.  'నేను బాగానే ఉన్నాను. బీజేపీ నిన్ను యూపీలోకి రానివ్వలేదు... అందుకే ఆ పార్టీ అక్కడ గెలిచింది' అని ట్వీట్ చేశారు. వీరిరువురూ గతంలోనూ ఎన్నోసార్లు ఇటువంటి సెటైర్లనే వేసుకున్నారు.





  • Loading...

More Telugu News