: మణిపూర్, గోవాల్లో హంగ్.. ఏ పార్టీకీ రాని స్పష్టమైన మెజారిటీ!
మణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఇప్పుడు తేలిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మణిపూర్‌లో 60 స్థానాలకు గానూ 31 స్థానాల్లో ఆధిక్యం కనబర్చాల్సి ఉంటుంది. ఇక గోవాలో 40కిగాను 21 స్థానాల్లో ఆధిక్యం సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోవాలో కాంగ్రెస్, బీజేపీ చెరో 12 స్థానాలు గెలిచాయి. మరోవైపు మణిపూర్‌లో ఇప్పటివరకు బీజేపీ 16 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలిచింది. మరోపక్క అదే రాష్ట్రంలో బీజేపీ 21 స్థానాల్లో, కాంగ్రెస్ కూడా 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో పూర్తి ఫలితాలు వెలువడినా ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రావడం కష్టమే. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో సమీకరణాలు ఎలా మారతాయి? ఎవరు సర్కారుని ఏర్పాటు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.