: ఎన్నిక‌ల ఫ‌లితాలపై జోకులు: సోషల్ మీడియాలో అఖిలేష్, రాహుల్ లపై పేలుతున్న సెటైర్లు!


దేశ రాజ‌కీయాల్లో కీల‌కమైన ఉత్త‌ర‌ప్రదేశ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పాటు ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలకు షాక్ ఇస్తూ బీజేపీకి ప్రజలు జేజేలు కొట్ట‌డంతో రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌, అఖిలేష్ యాద‌వ్‌ల‌తో పాటు ప‌లు ప్ర‌ధాన‌ ప్ర‌తిపక్ష నేత‌లపై సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం అఖిలేష్ త‌న తండ్రికి 'ఐ యాం సారీ డాడ్' అని చెబుతున్న‌ట్లు, రాహుల్ గాంధీ త‌న త‌ల్లికి 'ఐ యాం సారీ మ‌మ్' అని చెబుతున్న‌ట్లు వ‌చ్చిన పోస్టులు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. 'మా పార్టీని మోదీ ఓడించ‌లేదు.. రాహుల్ గాంధీ ఓడించాడు' అంటూ అఖిలేష్ యాద‌వ్ ప్లకార్డులు ప‌ట్టుకున్న‌ట్లు ప‌లువురు పోస్టులు చేస్తున్నారు. గుజరాత్ గాడిదలు అని కొందరు అన్నారని, అయితే, గాడిదలే బలంగా మిమ్మల్ని తన్నాయా? అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.




  • Loading...

More Telugu News