: రాహుల్ గాంధీ అట్టర్ ఫ్లాప్.. సొంత నియోజకవర్గంలో కూడా అవమానమే!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీ శక్తిని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి జీర్ణించుకోలేని అపజయాన్ని తెచ్చిపెట్టాయి. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎలాగైనా బీజేపీని యూపీలో అధికారంలోకి రాకుండా చేయాలనుకున్న రాహుల్ ఆశలు పటాపంచలయ్యాయి. ఎన్నికల్లో ఈ కూటమికి ఘోర పరాభవమే మిగిలింది. బీజేపీకి ఈ కూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేక పోయింది. మరోవైపు రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలు పీడకలగా నిలిచిపోనున్నాయి. ఆయన వ్యక్తిగత ప్రతిష్ట ఈ ఎన్నికలతో పూర్తిగా మంటగలిసింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆయన గెలిపించుకోలేక పోయారు. మోదీ ముందు ఆయన పూర్తిగా వెలవెలబోయారు.