: బ్ర‌హ్మోస్ సూప‌ర్‌సోనిక్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన భారత్


ఒడిశా తీరంలోని అబ్దుల్ క‌లామ్ దీవి నుంచి భార‌త్ ఈ రోజు బ్ర‌హ్మోస్ సూప‌ర్‌సోనిక్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. నెల రోజుల్లో మూడ‌వ సారి ఈ క్షిప‌ణిని ప‌రీక్షించిన‌ట్లు డీఆర్‌డీవో శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. తాజాగా 450 కిలోమీటర్ల లక్ష్యంగా ఈ ప్రయోగం జరిగిందని చెప్పారు. ఈ బ్ర‌హ్మోస్ క్షిప‌ణిని భార‌త్.. ర‌ష్యాతో క‌లిసి అభివృద్ధి చేసిన విష‌యం తెలిసిందే. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ గ్రూపులో భారత్ తన పరిధిని విస్తరించిన అనంత‌రం ఈ క్షిప‌ణి పరీక్షను నిర్వహించింది.

  • Loading...

More Telugu News