: యూపీలో ముఖ్యమంత్రి రేసులో మరో ముగ్గురు నేతలు!


ఉత్త‌ర‌ప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఘోర ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తుండ‌డంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, స‌మాజ్ వాదీ పార్టీ అభ్య‌ర్థి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయ‌న మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడ‌నున్నారు. మ‌రోవైపు భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి యూపీ ముఖ్యమంత్రి పదవి కోసం రాజ్‌నాథ్ సింగ్ పేరు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ రేసులో మ‌రో ముగ్గురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు సిద్ధార్థ్ నాథ్, యోగి ఆదిత్యానంద, మౌర్య సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న‌ యూపీలో బీజేపీ ఇప్ప‌టికి మొత్తం 160 స్థానాల్లో గెలుపొందింది.

  • Loading...

More Telugu News