: మాజీ క్రికెటర్ సిద్ధూకు డిప్యూటీ సీఎం పదవి?


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. అకాలీదళ్-బీజేపీ కూటమికి ఈ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో సీఎంగా పనిచేసిన అమరీందర్ సింగ్ ను... ఎన్నికల ప్రచారం సమయంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరోవైపు, మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ అయిన నవజ్యోత్ సింగ్ సిద్ధూకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అమృత్ సర్ (తూర్పు) నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సిద్ధూ విజయం సాధించారు.

  • Loading...

More Telugu News