: ప్రియాంకగాంధీ కాగితపు పులి మాత్రమే.. ఆమెకు అంత సీన్ లేదులెండి!: స్మృతి ఇరానీ
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా ఎక్కువగా ఊహించుకున్నారని... ఆమెకు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. ఆమె కేవలం కాగితపు పులి మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ... ఆ పార్టీలను యూపీ ప్రజలు నమ్మలేదని ఆమె తెలిపారు. అఖిలేష్, రాహుల్ లను ఓటర్లు దూరం పెట్టారని చెప్పారు. యూపీ ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారని, బీజేపీకి అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కులం, మతం కార్డులు పని చేయలేదని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి యూపీ ప్రజలు జై కొట్టారని తెలిపారు.