: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఘోర పరాభవం... రెండు స్థానాల్లోనూ ఓటమి


ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ దిశగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. మొత్తం 70 స్థానాలున్న ఉత్తరాఖండ్ లో 51 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 15 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. మరో నాలుగు స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు ఘోర పరాభవం ఎదురైంది. హరిద్వార్ (రూరల్), కిచ్చా నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన... రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. 

  • Loading...

More Telugu News