: సినిమాలకు 'నో' చెప్పిన భర్త.. విడాకులు తీసుకున్న బాలీవుడ్ శృంగార నటి
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోతో భారత ప్రేక్షకులకు పరిచయమైంది పాకిస్థానీ నటి వీణామాలిక్. ఈ షోతో ఆమెకు పాప్యులారిటీ రావడంతో బాలీవుడ్ అవకాశాలు ఈ అమ్మడి తలుపు తట్టాయి. పలు సినిమాల్లో శృంగార పాత్రల్లో నటించిన వీణా... తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అసద్ ఖటక్ అనే వ్యాపారవేత్తను 2013లో పెళ్లి చేసుకుంది. అనంతరం పూర్తిగా కుటుంబానికే అంకితమయింది. అయితే గత కొంత కాలంగా మళ్లీ సినిమాల్లో నటించడానికి వీణా ప్రయత్నిస్తోంది. అయితే సినిమాల్లో నటించడానికి భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఆమెకు అడ్డు చెప్పారు. దీంతో, సినిమాల కోసం తన భర్తకు దూరమవడానికి ఈమె సిద్ధమైంది.
విడాకుల కోసం లాహోర్ కోర్టును వీణామాలిక్ ఆశ్రయించింది. ఈ క్రమంలో అసద్ కు కోర్టు సమన్లు పంపింది. ఆ సమన్లకు అసద్ స్పందించకపోవడంతో, వీణామాలిక్ కు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. చట్టపరంగా విడాకులు మంజూరు చేసింది. దీంతో, సినిమాల్లో రీఎంట్రీకి ప్లాన్ చేసుకుంటోంది ఈ హాట్ బ్యూటీ.