: ఎదురు కాల్పుల్లో 9 మంది జవాన్లు, ఇద్దరు మావోల మృతి!
ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలోని బెజ్జి అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం మావోలు పారిపోయారు. వీరి కోసం సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి.