: ధర్మవరం ఘర్షణపై స్పందించిన పరిటాల శ్రీరామ్


అనంతపురం జిల్లా ధర్మవరంలో విద్యుత్ కేబుల్ విషయమై మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరుల మధ్య నిన్న ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబును పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఘర్షణపై వివరాలను తెలుసుకునేందుకే ఎస్పీ వద్దకు వచ్చానని చెప్పారు. కొందరు హద్దుమీరి మాటలు మాట్లాడటంతోనే ఘర్షణ జరిగిందని అన్నారు. కేబుల్ పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఈ వర్కు కూడా పెద్ద మొత్తానిది కాదని... అయినా, ఉన్నట్టుండి ఈ గొడవ జరగడం బాధాకరమని చెప్పారు. వరదాపురం సూరితో తమకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు.

  • Loading...

More Telugu News