: రాజీనామా సమర్పణకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన అఖిలేష్!
ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాలేదని తెలిసిపోయిన తరువాత, యూపీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ రాజీనామా చేసేందుకు మరికాసేపట్లో గవర్నర్ వద్దకు వెళ్లనున్నారు. ఈ మేరకు గవర్నర్ అపాయింట్ మెంట్ ను ఆయన కోరారు. మధ్యాహ్నం తరువాత ఆయన గవర్నర్ ను కలిసి తన రాజీనామాను సమర్పిస్తారని తెలుస్తోంది. ఆపై కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ తాత్కాలిక సీఎంగా అఖిలేష్ కొనసాగాలని గవర్నర్ కోరతారు. మరోవైపు యూపీలో ఘన విజయంతో బీజేపీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.