: గోవాలో బీజేపీపై దెబ్బ... ఓడిపోయిన సీఎం లక్ష్మీకాంత్


గోవాలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆశలు నల్లేరుపై నడకలా సాగడం లేదు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్, కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ రఘునాథ్ చేతిలో ఓడిపోయారు. మొత్తం 40 స్థానాలున్న అసెంబ్లీలో 1 ఫలితం, 18 స్థానాల ట్రెండ్స్ వెల్లడి కాగా, కాంగ్రెస్ ఒక చోట గెలిచి, 7 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 7 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోయిందని ఫలితాల సరళి తెలుపుతోంది.

  • Loading...

More Telugu News