: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని నిరూపించిన బీజేపీ!


ఎగ్జిట్ పోల్స్ వేసే అంచనాలు పూర్తిగా నమ్మే పరిస్థితి లేదని మరోసారి నిరూపితమైనట్టు కనిపిస్తోంది. యూపీలో బీజేపీ అధికారానికి దగ్గరగా మాత్రమే వస్తుందని, పూర్తి స్థాయి మెజారిటీ దక్కబోదని అత్యధిక ఎగ్జిట్ పోల్ సంస్థలు స్పష్టం చేయగా, అవన్నీ తారుమారయ్యాయి. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 204 కాగా, బీజేపీ ఇప్పటికే 220 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళుతోంది. సమాజ్ వాదీ కూటమి 62 స్థానాల్లో, బీఎస్పీ 28 స్థానాలకు పరిమితం కాగా, మరో 12 చోట్ల ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.

ఉత్తరాఖండ్ విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతున్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునేలా ఉంది. 70 స్థానాలున్న రాష్ట్రంలో 68 చోట్ల ట్రెండ్స్ వెలువడుతుండగా, బీజేపీ 51 చోట్ల, కాంగ్రెస్ 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇక మణిపూర్, గోవా విషయంలోనూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యేట్టు కనిపించడం లేదు. మణిపూర్ లో బీజేపీ స్వీప్ చేయవచ్చని పోల్స్ వెల్లడించగా, ఇక్కడ కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తోంది. గోవాలోనూ ఇదే పరిస్థితి.

  • Loading...

More Telugu News