: పంజాబ్ లో స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతున్న కాంగ్రెస్... గోవాలో బీజేపీకి గట్టి పోటీ


ముందుగా ఊహించినట్టుగానే పంజాబ్ పీఠం కాంగ్రెస్ హస్తగతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం 45 స్థానాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ వెల్లడికాగా, కాంగ్రెస్ 24 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచి 15 చోట్ల ఆధిక్యంలో ఉండగా, అకాలీదళ్ - బీజేపీ కూటమి కేవలం 6 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ మేజిక్ ఫిగర్ 59 కాగా, కాంగ్రెస్ సులువుగానే ఆ మార్క్ ను చేరుతుందని అంచనా. మరోవైపు గోవాలో బీజేపీ విజయం అంత సులువుగా కనిపించడం లేదు. 40 స్థానాలున్న గోవాలో ఆరు నియోజకవర్గాల ట్రెండ్స్ లో బీజేపీ, కాంగ్రెస్ లు చెరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మణిపూర్ లో మూడు స్థానాలకు ట్రెండ్స్ వెల్లడి కాగా, కాంగ్రెస్ 2, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

  • Loading...

More Telugu News