: వెనక్కి తగ్గిన తెలంగాణ విద్యాశాఖ.. 15 నుంచి ఒంటిపూట బడులు
ఒంటిపూట బడులకు స్వస్తి చెప్పిన తెలంగాణ విద్యాశాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఒత్తిడితో వెనక్కి తగ్గిన విద్యాశాఖ ఈ ఏడాది యథావిధిగా ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అన్ని స్కూళ్లకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. 2016-17 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 21 నుంచే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. పాఠ్యపుస్తకాలను సకాలంలో పాఠశాలలకు అందించే ఏర్పాట్లు చేయాలని, ఏప్రిల్ 3 నుంచి 13 వరకు ‘బడిబాట’ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.