: యూపీలో సొంత ప్రభుత్వం దిశగా అడుగులు మొదలుపెట్టిన బీజేపీ!


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, కావాల్సిన మెజారిటీ రాదని అంచనాలు వేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు కానున్నాయా? ప్రస్తుతం వెల్లడవుతున్న ఫలితాల ట్రెండ్స్ ను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. మొత్తం 403 స్థానాలున్న యూపీలో 55 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ వెల్లడికాగా, బీజేపీ కూటమి 32 స్థానాల్లో ఆధిపత్యంలో ఉంది. సమాజ్ వాదీ కూటమి 13 స్థానాల్లో బీఎస్పీ 7 చోట్ల, ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే, యూపీ పీఠం బీజేపీకి ఖాయమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News