: ఏపీకి బూస్టిచ్చేందుకు 15 మంది కేంద్ర మంత్రులను ఒకే చోట కూర్చోబెట్టిన వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత మిగిలిన ఏపీకి ఎన్నో సమస్యలు. పెండింగ్ లో పలు అంశాలు. వీటిని పరిష్కరించాలంటే, కేంద్రం కల్పించుకోక తప్పనిసరి పరిస్థితి. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కదిలిన వెంకయ్యనాయుడు, ఒకరు, ఇద్దరు కాదు... ఏకంగా 15 మంది కేంద్ర మంత్రులను ఒకే చోట కూర్చోబెట్టి సమస్యల పరిష్కారం దిశగా ఏ మేరకు చర్యలు జరుగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం సాగగా, ఉన్నతాధికారుల నుంచి ఆయన సమాధానాలను రాబట్టారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, సురేశ ప్రభు, ప్రకాశ్ జావడేకర్, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్, ఉమాభారతి, స్మృతి ఇరానీ, నరేంద్రసింగ్ తోమర్, రాధామోహన సింగ్, థావర్ చంద్ గెహ్లాట్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, కల్ రాజ్ మిశ్రా, మహేశ్ శర్మలతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.