: పొద్దున్నే గుళ్లకు వెళ్లి నేతల ప్రార్థనలు... గెలిపించాలని పూజలు!


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో, పోటీ పడ్డ అభ్యర్థుల్లో పలువురు ఈ ఉదయం దేవాలయాల్లో సందడి చేశారు. తమను గెలిపించాలని ప్రత్యేక పూజలు చేసి మొక్కుకుంటున్నారు. లక్నో కంటోన్మెంట్ లో బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ హనుమాన్ దేవాలయానికి వెళ్లి పూజలు చేశారు. ఉత్తరాఖండ్, యూపీల్లోని దేవాలయాలు, పంజాబ్ లోని గురుద్వారాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థుల పూజలతో సందడి నెలకొంది. మరోవైపు పలు ప్రాంతాల్లో తాము అభిమానించే పార్టీలు విజయం సాధించాలని కార్యకర్తలు హోమాలు ప్రారంభించారు. కాగా, పంజాబ్ లో 53, గోవాలో 2, యూపీలో 75, ఉత్తరాఖండ్ లో 15, మణిపూర్ లో 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News