: పాక్ కు చెక్ చెప్పేందుకు కదిలిన అమెరికా... ఉగ్ర రాజ్యమేనని యూఎస్ కాంగ్రెస్ లో బిల్లు


తన భూభాగంపై ఉన్న ఉగ్రవాద సంస్థలకు ఊతమిస్తూ, భారత్ సహా పలు దేశాల భద్రతకు ముప్పుగా మారిన పాకిస్థాన్ కు చెక్ చెప్పేందుకు అమెరికా కదిలింది. పాక్ ను ఉగ్ర రాజ్యంగా ప్రకటించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్ ఓ బిల్లును ప్రవేశపెట్టింది. 'పాకిస్థాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ఆఫ్ 2015' పేరిట ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యుడు, ఉగ్రవాదంపై ఏర్పాటైన హౌస్ సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాక్ ఓ నమ్మలేని మిత్రుడని, అమెరికా శత్రువులను అక్కడి పాలకులు కాపాడారని ఆరోపించారు. ఒసామా బిన్ లాడన్, హక్కానీ నెట్ వర్క్ తదితర పేర్లను ప్రస్తావించిన ఆయన, ఉగ్రవాదానికి పాక్ మద్దతిస్తోందనడానికి ఆధారాలు ఉన్నాయని అన్నారు. పాక్ ఆగడాలను అడ్డుకోవాల్సిన సమయం వచ్చిందని, లేకుంటే తొలుత నష్టపోయేది అమెరికాయేనని టెడ్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతును ఆపేలా ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News