: పాఠ్యాంశంగా భగవద్గీత.. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ
పాఠ్యాంశాల్లో భగవద్గీతను చేర్చాలంటూ బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి శుక్రవారం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అందించేందుకు పాఠ్యాంశాల్లో భగవద్గీతను తప్పనిసరి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా శుక్రవారం లోక్‌సభలో మొత్తం 103 ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. మహిళలపై జరిగే దాడులపై వేగవంతమైన విచారణ కోసం ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఓ బిల్లును ప్రవేశపెట్టగా బీజేపీ సభ్యుడు మహేశ్ గిరి పారిశుద్ధ్య నిర్వహణ బిల్లును ప్రవేశపెట్టారు.