: అమరావతి రైతులకు తీపి కబురు.. కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు కాలవ్యవధి పెంపు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఈ బడ్జెట్‌లో ప్రకటించిన కేపిటల్ గెయిన్స్ ట్యాక్ మినహాయింపు కాల వ్యవధిని పెంచింది. తొలుత రెండేళ్లపాటు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ప్లాట్లు పొందిన తర్వాత రెండేళ్లపాటు దీనిని వర్తింపజేయాలని రైతులు కోరారు.

ఈ విషయమై శుక్రవారం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సమాధానమిస్తూ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు మూడేళ్లు పొందే వీలుందని తెలిపారు. భూ సమీకరణ పథకం కింద భూమిని కానీ భవనాన్ని కానీ లేదా రెండింటినీ బదిలీ చేసిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. భూ సమీకరణ ద్వారా భూములిచ్చి వాటికింద పొందిన భూ సమీకరణ యాజమాన్య పత్రాలను అమ్ముకున్నా ఈ మినహాయింపు వర్తిస్తుందని మంత్రి లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

 

  • Loading...

More Telugu News