: ఇప్పటికైతే అఖిలేశ్ యాదవ్, మాయావతిదే ఆ రికార్డు!

మరికొన్ని గంటల్లో యూపీ పీఠం ఎవరిదో తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే ఓటేసినా, ఎస్పీ-కాంగ్రెస్, బీఎస్పీ కూడా ఆశగానే ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌‌కు ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి మాయావతి తప్ప ఇప్పటి వరకు ఎవరూ ఐదేళ్లపాటు పూర్తిగా ముఖ్యమంత్రిగా పదవీ కాలాన్ని పూర్తిచేయలేకపోయారు.

2007 నుంచి 2012 వరకు ఐదేళ్లపాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత ఐదేళ్లు ఎస్పీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కే ఆ ఘనత దక్కుతుంది. కాగా మొత్తం 403 స్థానాలున్న యూపీలో అధికారం కోసం కావాల్సింది 202 సీట్లు. మరి కాసేపట్లో ఫలితాలు వెలువడనుండడంతో నేతల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది.

More Telugu News