: ఇండియాతో దోస్తీ కోసం... చేతులు చాస్తున్న అమెరికా!


ఇండియాతో మరింత సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్న అమెరికా, భవిష్యత్తులో రెండు దేశాల మధ్యా లోతైన బంధం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉండే కాలంలో, భారత్ - అమెరికా మధ్య మరింత మైత్రి సాధ్యమేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పైసర్ వ్యాఖ్యానించారు. తొలుత తమ విదేశాంగ విధానాన్ని మార్చుకున్న తరువాత, భారత్ వంటి దేశాలతో దృఢమైన బంధం కోసం కొత్త అంశాలను జోడిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారం వేళ సైతం ట్రంప్ ఇదే విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. విద్వేష భావాలను కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని ట్రంప్ కృతనిశ్చయంతో ఉన్నారని, ఇదే సమయంలో తమ చట్టాలను అమలు చేసే విషయంలోనూ ఆయన గట్టిగా ఉన్నారని వెల్లడించారు. నైతిక సూత్రాలకు కట్టుబడి ఇరు దేశాలూ ముందుకు సాగాల్సి వుందని తెలిపారు.

  • Loading...

More Telugu News