: వాడొక్కడే అనుభవించుడా? మనకొద్దా? వచ్చెయ్: జేఏసీ నేత పిట్టల రవీందర్ ఫోన్ సంభాషణ కలకలం


తెలంగాణ జేఏసీని చీల్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కోదండరామ్ తదితరులు ఆరోపిస్తున్న వేళ, అది నిజమే అయి ఉండొచ్చనేలా రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ కన్వీనర్ బియ్యంకర్ శ్రీనివాస్ తో, జేఏసీ నేత పిట్టల రవీందర్ జరిపిన ఫోన్ సంభాషణలు కలకలం రేపుతున్నాయి. జేఏసీ నుంచి తిరుగుబాటు చేస్తున్న వారు నిర్వహించే సమావేశానికి వస్తే రూ. 2 లక్షలు ఇస్తానంటూ ఆయన ఆఫర్ చేస్తున్నట్టు ఈ ఆడియో రికార్డులో ఉంది.

'కొట్లాడి తెలంగాణ తెచ్చాం. అనుభవించుదాం ఇగ. ఎన్నిరోజులు పని చేసినా గింతే. గోడకు కొట్టిన పిడకల్లెక్క ఇంతే. వాడొక్కడే అనుభవించుడా? మనం అనుభవించొద్దా? ఇంకా కొట్లాడుడేనా? మన జీవితాలు మనం చూసుకుందాం. నీ ఎనుక నేనున్నా. రేపు మీటింగ్‌కు రా. రూ. 2 లక్షలు ఇస్తా' అంటూ జేఏసీ నేత పిట్టల మాట్లాడినట్లుగా ఉంది. దీన్ని బయటపెట్టిన బియ్యంకర్, ఈ రికార్డులను జేఏసీ పెద్దలకు పంపారు. పిట్టల తప్పు చేస్తున్నాడని, వేములవాడకు చెందిన కనుకయ్యతో కలసి తనను రమ్మన్నాడని ఆరోపించారు. తాము కోదండరాం నాయకత్వంలోనే పని చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News