: బెంగళూరులో దారుణం... నడిరోడ్డుపై పబ్లిక్ గా హత్య


బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కమలానగర్ లోని ఇంట్లో పడుకున్న రౌడీ షీటర్ సునీల్ పై నాగా గ్యాంగ్ సభ్యులు దాడి చేశారు. నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి మరీ అంత్యంత పాశవికంగా కత్తులతో నరికి చంపారు. తన కుమారుడ్ని రక్షించుకునేందుకు ముందుకు వచ్చిన తల్లిపై కూడా వారు కత్తులతో దాడికి దిగారు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగా ఈ దారుణానికి పాల్పడడం విశేషం. కాగా, ఈ ఘటనను ఒక వ్యక్తి వీడియో తీయడంతో దీని ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బాధితుడు సునీల్ వారం క్రింతమే జైలు నుంచి విడుదలయ్యాడని, నాగా గ్యాంగ్ సభ్యులు అతని హత్యకు పక్కాగా ప్రణాళిక రచించి, అంతం చేశారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆ పరిసరాల్లో భీతావహ వాతావరణం ఏర్పడింది. 

  • Loading...

More Telugu News