: షాహిద్ కపూర్ భార్య వ్యాఖ్యలతో బాలీవుడ్ లో కలకలం


ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మిరా రాజ్ పుత్ వ్యాఖ్యలు బాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. సినీ పరిశ్రమలో వివాహం తరువాత కూడా పని చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనినో ఉద్యమంలా బాలీవుడ్ నటీమణులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముంబైలో ఈఈఎంఏ(ఈవెంట్‌ అండ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ మేనేజ్‌ మెంట్‌ అసోసియేషన్‌) నిర్వహించిన కార్యక్రమంలో మీరా రాజ్ పుత్ మాట్లాడుతూ, 'నేను బాధ్యత గల గృహిణిని అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. మహిళలు కేవలం ఇల్లాలిగా ఎందుకు ఉండకూడదు? ఈ విషయంలో ఎవరి ఆలోచనలు, అభిప్రాయాలు వారికుంటాయి. అలాగే నా ఆలోచనలు నాకున్నాయి.

 నా కూతురు మిషాని ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డాను. పిల్లలతో కాసేపు హడావుడిగా గడిపి ఉద్యోగం, పని అంటూ వారిని విడిచి వెళ్లిపోవడం నాకు నచ్చదు. ఓ తల్లిగా నేను నా కూతురి బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటున్నాను. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉండాలనుకుంటున్నాను. మిషా ఎదుగుదలను చూడటం వెలకట్టలేని అనుభవం. మిషా నేను కన్న కూతురు, నేను ఇంట్లో పెంచుకునే కుక్కపిల్ల కాదు’ అంటూ మాట్లాడింది. దీంతో బాలీవుడ్ మొత్తం షాక్ తింది. ఆమె ఈ వ్యాఖ్యలు ఈ మధ్యనే కొడుకు పుట్టిన కొన్నాళ్లకే తిరిగి తన వృత్తిలో బిజీ అయిపోయిన కరీనాని ఎత్తిపొడిచేందుకేనని బాలీవుడ్ భావిస్తోంది. 

  • Loading...

More Telugu News