: పురుషుల కంటే లేడీసే స్ట్రాంగ్, ఎనర్జిటిక్!: షారూక్


పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఎనర్జిటిక్, పవర్‌ ఫుల్‌ గా ఉంటారని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తెలిపాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు చెప్పిన షారూఖ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహిళల గొప్పతనాన్ని కొనియాడాడు. సీనీ పరిశ్రమలో అంకితభావం, పట్టుదల, ప్రణాళిక, సామర్థ్యం ఉండాలని చెప్పాడు. ఉదయం 7 గంటలకు సెట్స్‌ కి వెళ్లిపోయి, సుమారు రెండున్నరగంటల పాటు పాత్ర కోసం మహిళలు మేకప్ వేసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. బరువైన కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సి ఉంటుందని, ఆ దుస్తులతో కనీసం నడిచేందుకు కూడా వీలుకాదని చెప్పాడు.

అలాంటి కాష్ట్యూమ్స్ తో రోజంతా షూటింగులో మహిళలు పాల్గొంటారని జాలిపడ్డాడు. తాను కూడా ఓ సినిమాలో లేడీ గెటప్ వేసి చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపాడు. ఆ సమయంలో లేడీ గెటప్ ఇబ్బంది అయితే కళ్లకు రెప్పలు కూడా పెట్టారని, ఘాగ్రా, విగ్గు, కంటిరెప్పలు ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో తనకు మాత్రమే తెలుసని అన్నాడు. ఆ బాధ అనుభవించడం కంటే చచ్చిపోవడమే మేలనిపించిందని షారూఖ్ చెప్పాడు. ఇంత స్ట్రాంగ్‌ బాడీ ఉన్న తనకే అలా అనిపిస్తే హీరోయిన్లు ఆ బాధను సినిమా షూటింగ్‌ ముగిసేంత వరకు భరిస్తారని, అందుకే స్త్రీలు పురుషుల కంటే పవర్ ఫుల్, స్ట్రాంగ్, ఎనర్జిటిక్ అని కితాబిచ్చాడు. 

  • Loading...

More Telugu News