: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్... 144కే ఆల్ ఫ్రీ


ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రీపెయిడ్‌ సిమ్ వినియోగదారులను ఉద్దేశించి ప్రకటించింది. ఈ ఆఫర్ ను ఆల్‌ ఫ్రీ పథకంగా పేర్కొంది. ఇంతవరకు వివిధ ప్లాన్లలో ఉన్న వినియోగదారులు ఆల్ ఫ్రీ పథకానికి మారినప్పుడు మాత్రమే ఆ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ పధకంలో 144 ఆల్ ఫ్రీ ప్లాన్ లోకి మారిన వినియోగదారులు దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు ఎంతసేపైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చని తెలిపింది. 30 రోజుల కాలపరిమితితో పని చేసే ఈ ఆఫర్ లో అదనంగా 500 ఎంబీ ఉచిత డేటాను కూడా అందజేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ జనరల్‌ మేనేజర్‌ కెఎస్‌ వరప్రసాద్‌ తెలిపారు. అదనపు వివరాలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్ కేర్ ను సంప్రదించాలని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News