: దేశంలోనే తొలి ఏసీ అంబులెన్స్ రైలు ప్రారంభం!
దేశంలో తొలి ఏసీ అంబులెన్స్ రైలు ప్రారంభమైంది. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే (సీఆర్) ప్రజా సంబంధాల అధికారి నరేంద్ర పాటిల్ తెలిపారు. ప్రమాదం జరిగిన గంటలోపే క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందిస్తే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడొచ్చన్న వైద్యుల సలహా మేరకు ఈ అంబులెన్స్ ను రూపొందించామని చెప్పారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు గాయాలు బారిన పడిన ప్రయాణికులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన తొలి రైలు ఇదేనని, నాలుగు కోచ్ లతో రైలు అంబులెన్స్ ను తయారు చేశామని అన్నారు.
కాగా, 2014లో మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో దివా-సవాంత్ వాది రైలు పట్టాలు తప్పిన సమయంలో రైలు అంబులెన్స్ ఉండాలని సెంట్రల్ రైల్వే మాజీ జనరల్ మేనేజర్ ఎస్ కే సూద్ నాడు తీసుకున్న నిర్ణయం ఫలితంగానే దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు సమాచారం.