: ధర్మవరంలో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే సూరి వర్గీయుల ఘర్షణ


అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక తారకరామనగర్ లో మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూర్య నారాయణ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విద్యుత్ కేబుల్ పనుల విషయంలో ఇరువర్గాలు గొడవపడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి, ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News