: యూపీలో ఎస్పీ పొత్తు నిర్ణయం తప్పే!: అమర్ సింగ్


ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం తప్పేనని ఎస్పీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల పొత్తు వల్ల, బీజేపీ సత్ఫలితాలను పొందనుందని, యూపీలో బీజేపీ పరిస్థితి మెరుగుపడడానికి కారణమైన రాహుల్, అఖిలేష్ కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. ఎందుకంటే, మోదీని విమర్శించేందుకు ‘గాడిద’, ‘తీవ్రవాది’.. వంటి దారుణమైన పదజాలంను ఆ నేతలు ఇద్దరూ ఉపయోగించారని అన్నారు. యూపీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న మోదీ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని అమర్ సింగ్ పేర్కొనడం గమనార్హం. 

  • Loading...

More Telugu News