: అత్యంత విలువైన అరుదైన బల్లి స్వాధీనం!
ఓ అత్యంత అరుదైన జాతి బల్లిని అక్రమంగా రైలు ద్వారా రవాణా చేస్తూ ఓ కేటుగాడు పోలీసులకు చిక్కాడు. ఆ వ్యక్తి కదలికపై అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు తమకు ఈ సమాచారం అందించారని పోలీసులు చెప్పారు. తాము వెంటనే గువాహటి రైల్వే స్టేషన్‌కు చేరుకుని చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. అతడి వద్ద ఉన్న లగేజీని పరిశీలించగా అందులోఈ బల్లి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దీని విలువ కోట్లలో ఉంటుందని పేర్కొన్నారు. పట్టుబడ్డ నిందితుడికి ఏ ముఠాతో సంబంధాలున్నాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సదరు నిందితుడు ఇతర జాతి జీవులను కూడా అక్రమ రవాణా చేస్తున్నాడా? అనే అంశంపై కూడా ప్రశ్నిస్తున్నామని అన్నారు.