: 300 మంది యువతులను వేధించిన 'కొవ్వూరు మణిరత్నం' అరెస్టు!


సైబర్ కీచకుడు మణిరత్నంను పోలీసులు హైదరాబాదులో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పోలీసులు నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మణిరత్నం అనే యువకుడు గత కొన్నేళ్లుగా ఫేస్ బుక్ లో యువతుల ఫోన్ నెంబర్లు సేకరించి, తన మొబైల్ నుంచి వాట్స్ యాప్ ద్వారా అసభ్యకర సందేశాలు, అశ్లీల వీడియోలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇలా సుమారు 300 మంది అమ్మాయిలను వేధించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ బాధితుల్లో షీటీమ్స్ మహిళా ఎస్సై కూడా ఉండడం విశేషం. దీంతో నిఘా వేసిన పోలీసులు మణిరత్నంను హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసి, రిమాండ్ కు పంపారు. 

  • Loading...

More Telugu News