: ఫిబ్రవరి 24 వరకు ఎన్ని కోట్ల కొత్త నోట్లు వచ్చాయో తెలుసా?


పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీ నోట్లు భారీ సంఖ్యలో మార్కెట్లోకి వచ్చాయి. ఫిబ్రవరి 24వ తేదీ వరకు మొత్తం రూ. 11,64,100 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సందర్భంగా జైట్లీ ఈ వివరాలను తెలిపారు. అయితే, పాత నోట్లు ఎన్ని వచ్చాయన్న విషయాన్ని మాత్రం జైట్లీ తెలపలేదు. వచ్చిన నోట్లు సరైనవో కాదో చూడాలని, అందులో నకిలీ నోట్లను ఏరివేయాల్సి ఉంటుందని...  ఇదంతా పెద్ద ప్రక్రియ అని, అంతా పూర్తయ్యాక పూర్తి నివేదికను ప్రవేశపెడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News