: ఏడాదికి 48 రోజులే ఆయనకు ఉద్యోగం... జీతం మాత్రం 5,26,00,000/-
సాధారణంగా ఉద్యోగం అంటే రోజూ ఆఫీసుకెళ్లడం విధులు నిర్వర్తించడం జరుగుతుంది. కేవలం 48 రోజుల ఉద్యోగానికి 5 కోట్ల 26 లక్షల రూపాయలకు పైగా జీతం అందుకుంటే అలాంటి ఉద్యోగం ఎక్కడుందోనని ఆరాతీస్తారంతా. బ్రిటన్‌కు చెందిన మాజీ ఆర్ధిక మంత్రి జార్జ్ ఓస్బోర్న్ ఈ ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం పదవిలో లేని ఆయన అమెరికాకు చెందిన బ్లాక్ రాక్ అనే ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి ఆర్థిక సలహాదారుగా సేవలందిస్తున్నారు. సలహాదారుగా నెలలో నాలుగు రోజులు మాత్రమే ఆయన విధుల్లో పాల్గొంటారు. 2016లో ఆయన కేవలం 14 సార్లు మాత్రమే కంపెనీతో ఆన్ లైన్ ద్వారా కనెక్ట్ అయి, సూచనలు ఇచ్చానని చెబుతున్నారు. ఇందుకుగాను ఆయనకు ఆ కంపెనీ 2.9 మిలియిన్ దిర్హామ్స్ (5,26,00,000 రూపాయలకు పైగా) జీతం అందిస్తుంది. ప్రస్తుతం తాను పదవిలో లేనని, ఎంపీగా విధులు నిర్వర్తిస్తే వెంటనే ఈ ఉద్యోగం వదులుకుంటానని తెలిపారు.