: చిన్న చిన్న గొడవలకే విడాకులివ్వడం కుదరదు: సుప్రీంకోర్టు

భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు క్రూరత్వం కిందకు రావని.. వాటి కారణంగా విడాకులు మంజూరు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి ఘటనలు పదే పదే పునరావృతమవుతుంటే అలాంటివి పరిశీలనార్హమని జస్టిస్ ఆర్.కె.అగర్వాల్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం వివరించింది.

'‘ఏదో ఒక ఘటనపై విడాకులు మంజూరు చేయడం కుదరదు. చిన్న కారణంతో ఆ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చు. మరో వ్యక్తి ఎదుట భార్యాభర్తలిద్దరూ వాగ్వాదానికి దిగడం క్రూరత్వం కిందకు రాదు. లోగడ కూడా ఇలాంటివి జరిగినట్లు తేలితే తప్పించి వాటిని ఆ విభాగం కింద పరిగణించలేం’’ అని పేర్కొంది. ఈ మేరకు ఒక వ్యక్తికి విడాకులు మంజూరు చేస్తూ కుటుంబ కోర్టు, డిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.

More Telugu News