: పాపం బాలిక...గాలి ఈడ్చుకెళ్లిపోయింది!
అమెరికాలోని ఓహియో స్టేట్ లో గాలి దుమారం ధాటికి బాలిక డోర్ తో పాటు అమాంతం గాల్లోకి లేచిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...ఓహియో లోని లిండ్రస్ట్ లో బ్రిటానీ అనే మహిళ తన నాలుగేళ్ల కుమార్తె మెడిసన్ గార్డ్ నర్ ను తీసుకుని బయట నుంచి అప్పుడే ఇంటికి చేరుకుంది. తల్లి కారు పార్క్ చేస్తుండడంతో, కూతురు ఇంటి తాళాలు తీసుకుని డోర్ ఓపెన్ చేసింది.
సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ భయంకరమైన సుడిగాలి వచ్చి అద్దాల తలుపుతో పాటు మెడిసిన్ ను అమాతం ఎత్తుకెళ్లిపోయింది. దీనిని చూసిన బ్రిటానీ పరుగున రాగా మెడిసిన్ గ్లాస్ డోర్ సైడ్ వాల్ మధ్యలో పడిపోయింది. కుమార్తెకు ఏమీ కాకపోవడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్న బ్రిటానీ అసలు ఏం జరిగిందా? అని సీసీటీవీ పుటేజ్ పరిశీలించింది. దీంతో నవ్వాపుకోలేక కుమార్తెకు చూపించగా...మెడిసిన్ కూడా ఆ వీడియోను చూసి నవ్వుకోవడం విశేషం. ఈ వీడియో ఆమె సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.