: షూటింగ్ లో గాయపడ్డ కత్రినా కైఫ్.. కొన్నాళ్లు బెడ్ రెస్ట్!
‘జగ్గా జాసూస్’ షూటింగ్ లో బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ గాయపడింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ దశలో ఉంది. క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ జరుగుతున్న సెట్స్ లోనే కత్రినా గాయపడింది. ఆమె మెడపై ఓ బరువైన వస్తువు పడినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీంతో, కత్రినా మెడ, వీపు భాగాలకు గాయాలయ్యాయని సమాచారం. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు షూటింగ్ కు కత్రినా దూరంగా ఉంటుందని సమాచారం. కత్రినా గాయపడటంతో ‘జగ్గా జాసూస్’ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ సరసన కత్రినా నటిస్తోంది.