: ఇంట్లోకి దూసుకొస్తోందని...టైటానిక్ లాంటి షిప్ కు ఎదురెళ్లాడు!


అమెరికాలోని ఫ్లోరిడాలో సముద్రం ఒడ్డున ఒక జంట అందమైన ఇంటిని నిర్మించుకుంది. ఇంట్లోంచి చూస్తే సముద్రం కనిపించేలా లాండర్ డేల్ పోర్టుకు కూతవేటు దూరంలో ఈ ఇంటిని నిర్మించుకున్నారు. ఈ మధ్యే అటుగా వచ్చిన ఎనిమిదంతస్తుల సెలబ్రిటీ ఇక్వినాక్స్ అనే జిగ్నాటిక్ క్రూయిజ్ షిప్ లాండర్ డేల్ పోర్టుకు వచ్చింది. ఈ సమయంలో ఆ షిప్ పోర్టును దాటి వారి నివాసం వైపుగా దూసుకొచ్చింది.

దీంతో బెంబేలెత్తిన ఇంటి యజమాని, షిప్ ఇంట్లోకి వస్తోందని పెద్దాగా అరుస్తూ షిప్ కు ఎదురుగా పరుగెత్తాడు. ఇంతలో అతని భార్య కూడా అక్కడికి వచ్చి, 'మీరు పరిమితికి మించి ముందుకు వస్తున్నారు. అలా రాకూడదు, వెంటనే వెన్కి వెళ్లిపోండి' అంటూ అరుస్తూ షిప్ కెప్టెన్ కు హెచ్చరికలు చేసింది. తమ ఏడేళ్ల జీవితంలో ఇలాంటి ఘటన ఎదురుకాలేదని ఆ తర్వాత ఆమె తెలిపింది. షిప్ తమ ఇంటికి వంద అడుగుల దూరంలో ఆగిందని తెలిపింది. లాండర్ డేల్ పోర్టు నుంచి ఈ ఘటనను షూట్ చేసిన బిల్‌ తోడాంటర్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా అది అందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News