: 2జీ, 3జీ, 4జీ కస్టమర్లకు హోలీ సందర్భంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆఫర్
కొత్తగా 4జీ సిమ్ కార్డులు తీసుకునే వారి కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) పలు ఆఫర్లను ప్రకటించింది. రూ.49కే 1జీబీ డేటా, రూ.149కే 3జీబీ డేటాను అందిస్తామని పేర్కొంది. అంతేకాక, తమ నెట్‌వర్క్ పరిధిలో ఫ్రీగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. హోలీ పండగ నేపథ్యంలో ఈ ఆఫర్ 28 రోజుల కాల పరిమితితో చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. అలాగే 3జీ, 2జీ కస్టమర్ల కోసం కూడా పలు ఆఫర్లను ప్రకటించింది. రూ.99కే అపరిమిత 3జీ డేటా, రూ.49కే అపరిమిత 2జీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది.