: సీనీ నటిని గర్భవతిని చేసి, మోసం చేసిన బీటెక్ విద్యార్థి అరెస్ట్


సినీ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్న ఓ యువతి (23)కి బీటెక్ చదువుతున్న యశ్వంత్ కుమార్ అనే యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సదరు యువతిని ప్రేమస్తున్నానని నమ్మించిన అతను ఏడాది పాటు ఆమెతో సహజీవనం చేశాడు. హైదరాబాదులోని రహ్మత్ నగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని వీరిద్దరు ఉంటున్నారు. గత డిసెంబర్ 2న అదే గదిలో పసుపుతాడు కట్టి పెళ్లి చేసుకున్నట్టు నమ్మించాడు.

ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో... ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత తనను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలని ఆమె డిమాండ్ చేయడంతో, అందుకు అతను నిరాకరించాడు. దీంతో, యశ్వంత్ పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన జుబ్లీహిల్స్ పోలీసులు... యశ్వంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యశ్వంత్ కుమార్ గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామానికి చెందినవాడు. 

  • Loading...

More Telugu News