: ఇంటెల్ టెక్నాలజీతో స్మార్ట్ షూస్.. చైనాలో విడుదల చేసిన షియోమీ


ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ షియోమీ కొత్తగా ఇంటెల్ టెక్నాలజీతో స్మార్ట్ షూస్ ను ప్రారంభింఛింది. ‘90 మినిట్స్‌ అల్ట్రా స్మార్ట్‌ స్పోర్ట్స్‌వేర్‌’ పేరుతో ఈ బూట్లను ఆవిష్కరించింది.ఈ స్మార్ట్‌ షూస్‌ను షాంఘైకు చెందిన రున్మి టెక్నాలజీస్‌ కో లిమిటెడ్‌ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ షూస్ స్కిడ్ అవ్వకుండా ఉండేందుకు అనేక ఫీచర్లను పొందుపరిచారు. ఇందులో బ్యాటరీ 60 రోజుల పాటు వస్తుంది. ఫిట్‌నెస్‌కు సంబంధించిన సమాచారం దాచి ఉంచడానికి ఈ బూట్ లలో ఇంటెల్‌ క్యూరీ చిప్‌ను పొందుపరిచారు. ఇంటెల్ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ షూస్ ద్వారా మనం ఎంత దూరం ప్రయాణించాం, ఎన్ని క్యాలరీల శక్తి ఖర్చయ్యింది? అనే వివరాలు వినియోగదారుడికి తెలుస్తాయి. నిపుణులైన రన్నర్లకు, అథ్లెట్లకు ఈ షూస్ ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ షూస్ ను చైనాలో మాత్రమే విడుదల చేశారు. బ్లూ అండ్ బ్లాక్, పింక్ అండ్ బ్లాక్ కలర్లలో లభించే ఈ షూస్ ధర 299 చైనీస్ యువాన్లు (సుమారు రూ.2,990).

  • Loading...

More Telugu News