: బ్యాంకులకు వరుసగా మూడు రోజుల సెలవు!
రేపటి నుంచి వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు వినియోగదారులు తమ పనులను సత్వరమే చక్కబెట్టుకోవాలని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో సూచించింది. రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం, ఆ మర్నాడు హోలీ పండగ కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నట్లు పేర్కొంది. కాగా, ఏటీఎంలలో డబ్బు డ్రా చేసుకునేందుకు వెళుతున్న వినియోగదారులకు ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.