: కన్నడ దర్శకుడు రఘుకు కిడ్నీ ఫెయిల్... వైద్య సాయం కోసం వినతి!
ప్రముఖ కన్నడ దర్శకుడు ఎటి రఘు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురవడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా కిడ్నీ ఫెయిల్ అయినట్లు తెలిపారు. అయితే, కనీస వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉన్న ఆయన దాతల కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా ఎవరైనా తనకు సాయం చేస్తే వైద్య చికిత్స చేయించుకుంటానని బెంగళూరులో నివసిస్తున్న ఆయన తెలిపారు. కాగా, ఇరవై ఏళ్ల కిందట సుమారు 30కు పైగా కన్నడ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. న్యాయనీతి ధర్మ, ధర్మయుద్ధ, అవళె నెరళు, గూండాగురు, పుట్టహెండ్తీ, సూర్యోదయ, జైలర్ జగన్నాథ్ .. తదితర హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ నటించిన 20 చిత్రాలకు రఘు దర్శకత్వం వహించడం విశేషం.