: వర్మ చెప్పినట్లు మహిళలు ఎలా ఆనందం పంచాలో నేర్చుకోవాలి: రాఖీ సావంత్!


ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో మహిళలపై వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేసిన ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ తీరుపట్ల సన్నీలియోన్‌తో పాటు మ‌హిళ‌లంద‌రూ మండిప‌డుతోంటే మ‌రోవైపు బాలీవుడ్ ఐటం గర్ల్‌ రాఖీ సావంత్ మాత్రం మద్ద‌తిస్తోంది. వ‌ర్మ ట్వీట్‌పై ఆమె తాజాగా మాట్లాడుతూ... రాం గోపాల్ వర్మ చెప్పింది స‌రైన‌దేన‌ని పేర్కొంది. సన్నీ లియోన్ లాగే అంద‌రు మహిళలూ ఆనందాన్ని పంచాలనే ఆయన వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నాన‌ని అంది. అంతేకాదు, వర్మ చెప్పినట్లు మహిళలు ఎలా ఆనందం పంచాలో నేర్చుకోవాలని వ్యాఖ్యానించింది. మహిళలు తమ బాధ్యతగా వంటగది బాధ్యతలు చూసుకుంటూనే, ఆనందం పంచడం ఎలా? అనే విషయంలో శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది. ఆమె ఈ వ్యాఖ్య‌ల్ని వెట‌కారంగా అన్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News