: పళనిస్వామి ‘బల నిరూపణ’ వీడియో స్టాలిన్ కి ఇవ్వండి: కోర్టు ఆదేశాలు
తమిళనాడు అసెంబ్లీలో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన సీఎం పళనిస్వామి బలనిరూపణ పరీక్షపై అభ్యంతరాలు తెలుపుతూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష డీఎంకే కార్యనిర్వహక అధ్యక్షుడు స్టాలిన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో స్టాలిన్ వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. తాము నిబంధనల ప్రకారమే బలపరీక్ష నిర్వహించామని కోర్టుకి అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. అయితే, వాదనలన్నింటినీ పరిశీలించిన కోర్టు ఈ రోజు తమిళనాడు సర్కారుకి పలు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా తీసిన వీడియో ఫుటేజీని స్టాలిన్ కు పంపించాలని ఆదేశించింది.