: మండే ఎండల వేళ విశాఖపై వరుణుడి కరుణ... ఆనందంతో గంతులేసిన యువత!


ఎండలు పెరిగి, సముద్రపు గాలుల ఉక్కపోతతో అల్లాడుతున్న విశాఖ వాసులపై వరుణుడు కరుణ చూపాడు. ఈ ఉదయం విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవగా, ప్రజలు సేదదీరారు. ఈ వర్షంతో నగరవాసులు ఊరట చెందగా, బీచ్ రోడ్డులో యువత వర్షంలో తడుస్తూ ఆనందంతో గంతులేశారు. ఈ వర్షంతో రోజువారీ పనులకు వెళ్లే కార్మికులు కొంత మేరకు ఇబ్బందులు పడ్డప్పటికీ, ఎండాకాలంలో వర్షం కొంతమేరకు ఉష్ణోగ్రతలను తగ్గిస్తుందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వేడిమి తగ్గిపోవడంతో విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారాయి.

  • Loading...

More Telugu News