: రిలయన్స్ జియో యూజర్లకు పేటీఎం ఆఫర్
ఉచిత డేటాకు మంగళం పలుకుతూ, ఈ నెలాఖరు నుంచి చార్జీల వసూలుకు రిలయన్స్ జియో నిర్ణయించిన నేపథ్యంలో, పేటీఎం బంపరాఫర్ ను ప్రకటించింది. తమ సంస్థ ద్వారా రిలయన్స్ జియోకు రీచార్జ్ చేసుకుంటే అదనపు లాభాలను అందిస్తామని తెలిపింది. జియో నెట్ వర్క్ ను తమ చెల్లింపు మాధ్యమ పరిధిలోకి తీసుకు వచ్చామని చెబుతూ, రూ. 303 ప్యాక్ ను పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకుంటే, రూ. 381 వరకూ ఎక్స్ ట్రా బెనిఫిట్స్ అందిస్తామని వెల్లడించింది. ప్రతి రీచార్జ్ పై రూ. 150 క్యాష్ బ్యాక్, రెండో సారి రీచార్జ్ పై రూ. 30 తక్షణ తగ్గింపును అందిస్తామని పేర్కొంది. ఈ లాభాలను పొందాలంటే, రూ. 499 విలువైన అన్ లిమిటెడ్ ప్యాక్ తో రీచార్జ్ చేసుకోవాల్సి వుంటుందని, దీనిపై రూ. 201 విలువైన యాడ్ ఆన్ ప్యాక్ ఉచితంగా పొందవచ్చని వెల్లడించింది.